సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి పోలీసు మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్ అవార్డును అందుకున్న కేశంపేట్ కానిస్టేబుల్ శివ కుమార్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గురువారం అభినందించారు. 2017 అక్టోబరు నెలలో భారీ వర్షాలకు షాద్‌నగర్ మండలం నాగులపల్లి చెరువులో కొట్టుకుపోతున్న స్థానికుడైన శేఖర్ గౌడ్‌ను 100 మీటర్ల దూరం నుంచి తాడు సహాయంతో లోపలికి వెళ్ళి అతనిని క్షేమంగా బయటకు తీసుకువచ్చి ప్రాణాలను కాపాడాడు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు శివ కుమార్ ధైర్య సాహసాలకు ప్రశంసించి ప్రధాన మంత్రి ‘పోలీసు మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్’ అవార్డుకు పంపారు. 2018వ సంవత్సరంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న శివ కుమార్‌కు అందించింది. శివ కుమార్ మెడల్‌ను సీపీ స్టీఫెన్ రవీంద్ర ధరింపజేశారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఏసీపీ కుశాల్కర్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌లు పాల్గొన్నారు. పోలీసులు తమ విధుల ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలవాలన్ని సీపీ సూచించారు.