జీడిమెట్ల, జూలై 21 : కోవిడ్ -19 రాకతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఊహించని మార్పులు వచ్చాయి. సామాన్యుల నుంచి ధనికుల వరకు కరోనా భారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అలాంటి వారి కోసం ఓ యువకుడు స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. మరికొంత మంది యువకులతో కలిసి సేవా కార్యక్రమా లకు శ్రీకారం చుట్టాడు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు అందించడంతోపాటు.. కరోనా భారిన పడిన అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేపట్టారు. అతనే ఎ.శ్యామ్‌కుమార్. 2018లో కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీలో ‘మనం లైఫ్ సేవ ర్స్’ చారిటబల్ ట్రస్టును ఏర్పాటు చేసి.. పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాడు.
వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తం సేకరణ.
కాలంలో అనాథ శవాలకు దహనసంస్కారాలు అన్నదానం.. నిత్యావసర సరుకుల పంపిణీ ..
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చేతుల మీదుగా మనం లైఫ్ సేవర్స్ చారిటబల్ ట్రస్టు సభ్యులు కోవిడ్ వారియర్ అవార్డును అందుకున్నారు.
వికలాంగులకు దాతల సహాయంతో వాకర్స్ అందజేత.. విద్యార్థులకు ఆర్థిక సహాయం
కారణంగా కొన్ని ప్రైవేటు సంస్థలు మూతపడగా.. అందులో పని చేసే ఉద్యోగులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసి.. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.