ఉప్పల్, జూలై 20 : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవా రం చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ఆయన పర్య టించారు. ఈ మేరకు అంబేద్కర్‌నగర్‌కాలనీలో సీడీపీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపట్టాలని, బోరుకు మోటారు బిగించాలని కాలనీవాసులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. అధికారులలో మాట్లాడి బోరు మోటారుకు కావాల్సిన ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, జగన్, రాంరెడ్డి, జగన్, వేణుగోపాల్‌రెడ్డి, మహేందర్, బాలకృష్ణ, శ్రీనివాస్‌యాదవ్, మాస శేఖర్, రామానుజం, సుందర్, అశోక్‌చారి, బాలేందర్, సంతోశ్ పాల్గొన్నారు.
ఉప్పల్ డివిజన్లోని దేవేందర్‌నగర్‌లో అభివృద్ధి పనులను బుధవా రం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కాలనీలో పర్యటించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్‌రెడ్డి, ఏఈ వసంత, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతో ష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మస్క సుధాకర్, మహిపాల్‌రెడ్డి, రవీం దర్‌రెడ్డి, రాజు, జీనత్‌బేగం, దేవేందర్నగర్కాలనీ అధ్యక్షుడు అలీం, లతారెడ్డి, పద్మారెడ్డి, బాలయ్య, ఉపేందర్ రెడ్డి, భాస్కర్, సుధాకర్, సందీప్, భాస్కర్ పాల్గొన్నారు.
అన్ని డివిజన్లల్లో అభివృద్ధి పనులు..
రామంతాపూర్, జూలై 20 : ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. బుధవారం హబ్సిగూడ డివిజన్ పరిధిలోని టీవీ స్టేషన్ వద్ద నుంచి గణేశ్‌నగర్ సాయిచరణ్ ఆసుపత్రి వరకు రూ.23.5 లక్షల వ్యయంతో కూడిన 450 డయా ఎంఎం వరదనీటి కాలువ పనులకు స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతనతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఈఈ నాగేందర్, ఏఈ కీర్తి, గరిక సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీ చారి, వెంకన్న గౌడ్, కొత్తపల్లి రమేశ్, మాజీ కార్పొరేటర్ రామారావు, దయానంద్, శ్రీనివాస్‌గుప్తా, క్రిష్ణాగౌడ్, ఎల్లాచారి, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.