చర్లపల్లి, జూలై 20 : బోనాలకు చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆలయాల వద్ద ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. డివిజన్ పరిధిలోని నాగార్జుననగర్, సుభాష్‌నగర్‌లోని కార్యాలయంలో అషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఇంజినీరింగ్, యూజీడీ వాటర్ వర్క్స్, ఎంటమాలజీ, శానిటేషన్, వర్క్ ఇన్స్పెక్టర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బోనాల సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల్లో ఏర్పడిన గుంతలను పూ డ్చివేయాలని సూచించారు. అమ్మవారి ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
డివిజన్ పరిధిలోని అంజనా క్లాసిక్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ బొంతు శ్రీదేవిని కలిశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రామంతాపూర్, జూలై 20 : బోనాల కోసం రామంతాపూర్ డివిజన్ పరిధిలోని పలు దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేపట్టాలని కార్పొరేటర్ శ్రీవాణి అన్నారు. బుధ వారం రోడ్లకు చేపట్టిన ప్యాచ్ వర్క్ పనులను ఆమె పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. బోనాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్, నాయకులు వెంకట్రావు, రేవు నర్సింహ, బాలకృష్ణగౌడ్, భిక్షపతి, ముత్యాల నర్సింహ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మల్లాపూర్, జూలై 20 : బోనాల పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక ని ధులను కేటాయించిందని కార్పొరేటర్ ప్రభుదాస్ అన్నారు. బుధవారం ఆయన మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ కృష్ణానగర్‌లోని అమ్మవారి ఆలయం వద్ద సంబంధిత అధికారులతో కలిసి బోనాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రోడ్లపై ఏర్పడిన గుంతలు, తదితర పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆయన ఆదేశించారు.