సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : మురికివాడల్లోని పేద యువతకు నైపుణ్యం కల్పించి.. ఉద్యోగాలు చూపించే బాధ్యతను జీహెచ్ఎంసీ తీసుకున్నది. జంటనగరాల పరిధిలోని దాదాపు 1500 మురికివాడల్లో సరైన ఉపాధి అవకాశాలు లేక.., ఏం చేయాలో తెలియక.., ఏం చేస్తే సుస్థిర ఉపాధి సాధ్యమో అర్థం కాక.., ఎందరో యువతీ యువకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుపేద యువత భవిష్యత్తులో ఎదిగేందుకుగాను సమున్నత కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారంచుట్టింది. పుణె మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో లైట్‌హౌజ్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ (ఎల్‌సీఎఫ్) కార్యక్రమాలను నగరంలో అమలు చేస్తున్నది. ప్రయోగాత్మకంగా చందానగర్ సర్కిల్లో అమలు చేసి, ఆ తర్వాత అన్ని సర్కిళ్లకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
చందానగర్ మోడల్ మార్కెట్ భవనంలో..
మహారాష్ట్రలోని పుణె కార్పొరేషన్లో లైట్‌హౌజ్ ప్రాజెక్టు ద్వారా సుమారు 5,500 మంది యువత శిక్షణ పొందారు. ఇతర నగరాల్లోనూ ఈ లైట్‌హౌజ్ సంస్థ సేవలు అందిస్తున్నది. కార్పొరేట్, బహుళ జాతీయ సంస్థలతో కలిసి మురికివాడల్లోని నిరుపేద యువతకు శిక్షణ ఇవ్వడం, ఆయా సంస్థల్లో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. గ్రేటర్‌లోని మురికివాడల పిల్లలకు లైట్‌హౌజ్ ప్రాజెక్టును చేరువ చేసి ఫలితాలను బేరీజు వేస్తామని అధికారులు పేర్కొన్నారు. అందులో భాగంగానే చందానగర్ మోడల్ మార్కెట్ భవనాన్ని సదరు సంస్థకు ఏడాదిపాటు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నది.
అమలు చేస్తారిలా..!