సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఇ రేసింగ్ హైదరాబాద్ వేదికగా ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నిర్వహించే రేసింగ్ ఈవెంట్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కీలకమైన కమిటీలను నియమిస్తూ జీవో జారీ చేసింది. కొత్తగా నియమించిన కమిటీలు ఎప్పటికప్పుడు ఫార్ములా ఇ-రేసింగ్ ట్రాక్‌కు సంబంధించిన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి. ప్రధానంగా ఎఫ్ఐఏ నిబంధనలకు అనుగుణంగా సర్యూట్ ట్రాక్స్, వీక్షకుల గ్యాలరీ, ఎమోషన్ క్లబ్స్, ఈ-విలేజ్, ఫిట్‌స్టాప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఎలక్ట్రికల్ పనులు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
కార్య నిర్వాహక కమిటీ ఎప్పటికప్పుడు ఫార్ములా ఇ-రేసింగ్ ట్రాక్స్‌కు సంబంధించిన పనులపై మేనేజింగ్తో సమావేశం కావాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటికే ఫార్ములా ఇ రేసింగ్ కోసం 2.37 కి.మీ పొడవైన వలయాకారపు ట్రాక్‌ను లుంబినీ పార్కు, తెలంగాణ నూతన సచివాలయం, ఎన్టీఆర్ గార్డెన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే రేసింగ్ నాటికి వివిధ రకాల పనులను పూర్తి చేసే బాధ్యతలను రెండు కమిటీలు పర్యవేక్షిస్తాయి.
కార్య నిర్వాహక కమిటీ..
మేనేజింగ్ కమిటీ..