ముషీరాబాద్, ఫిబ్రవరి 6 : తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం, ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శతాధిక కవుల కవితా నీరాజనం పేరిట రూపొందించిన ‘మహా సంకల్పం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. అరసం అర్గనైజింగ్ సెక్రటరీ పల్లేరు వీరాస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్వీ.సత్యనారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై మహా సంకల్పం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా, పోరాట యోధుడిగా ధర్మభిక్షం ప్రజాహితం కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, ప్రజా గాయకురాలు విమలక్క, మల్లిక్, భూపతి వెంకటేశ్వర్లు, పోరెట్టి రంగయ్య, బాబ్జీ, పల్లె నరసింహ, అరసం ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, కార్యదర్శి కేవీఎల్ రాధాశ్రీ, వెంకటస్వామి నాయుడు, శ్రీనివాస్, భిక్షపతి, శంకర్, భారతి, శ్రీనివాస్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.