అబిడ్స్, జూలై 10 : బోనాల సందర్భంగా పలు ప్రాంతాల్లో తొట్టెల ఊరేగింపు, పోతరాజు నృత్యాలు నిర్వహించారు. పురానాపూల్ నుంచి ఎంపీ భీష్మ నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో టీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మహిళా నా యకురాలు శాంతిదేవి, పలువురు పూజలు చేశారు.
బోనాల ఉత్సవాల్లో గోవింద్‌రాఠి
సబ్జిమండీ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మహేశ్ బ్యాంక్ డైరెక్టర్ గోవింద్ నారాయణ రాఠి, వై.బాబు గురులను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో చంద్రకాంత్ పాల్గొన్నారు.
గోల్కొండ కోటలో నాలుగో బోనం..
జగదాంబిక ఎల్లమ్మ బోనాల్లో భాగంగా నాలుగో బోనం పూజలు చేశారు. లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ వరకు స్వాగత వేదికలను ఏర్పాటు చేసిన తొట్టెల ఊరేగింపులకు స్వాగతం పలికారు. పురానాపూల్ నుంచి సంఘసేవకులు ఎం.పి.భీష్మ చేపట్టిన తొట్టెల ఊరేగింపు కనుల పండువగా జరిగింది. లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ వరకు గౌడ సంఘం, బస్తీ సంక్షేమ సంఘం, ఇసుర్రాయి మైసమ్మ దేవాలయం, బీజేపీ, హరిదాస్ పురా బస్తీ సంక్షేమ సంఘం, ఎమ్మార్పీఎస్ , ఎంఐఎం, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు.
ఏడుగుళ్ల పోచమ్మ ఆలయంలో..
బోనాలను ఈ నెల 24న నాంపల్లి పటేల్ చమన్ శ్రీ ఏడుగుళ్ల పోచమ్మ ఆలయంలో నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామని ఆలయ కమిటీ చైర్మన్, నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆలయం ఆవరణలో నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఆనంద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ఈ నెల 24న బోనాలు, 25న రంగం ఉంటాయని చెప్పారు. సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు.
ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం
లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం తరుఫున మూడు రోజుల పాటు ఢిల్లీలో తెలంగాణ బోనాలను నిర్వహించి పాతబస్తీకి చేరుకున్న సందర్భంగా ఆలయ ఫోర్‌మెన్ కమిటీ చైర్మన్ శీరా రాజ్‌కుమార్, కమిటీ సభ్యులను ఆలయ ప్రతినిధులు, భక్తులు సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర నాయకత్వం, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కార్వాన్, జూలై 10 : దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ అమర్‌సింగ్ అన్నారు. ఆలయం ఆవరణలో ఆలయ ఉమ్మడి బోనాల ఉత్సవ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అమర్‌సింగ్ మాట్లాడుతూ.. ఘటాల ఊరేగింపును పరిసర బస్తీలు, కాలనీల్లో నిర్వహించి, ఆలయం ఎదుట భారీ తొట్టెలు పెట్టి పూజలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో దేవర రాజేశ్వర్, మాజీ కార్పొరేటర్లు మిత్ర కృష్ణ, బంగారి ప్రకాశ్, దేవర కరుణాకర్ పాల్గొన్నారు.
గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో..
సబ్జిమండీలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మహంకాళి, నల్లపోచమ్మ ఉమ్మడి ఆలయాల నుంచి ఎల్లమ్మకు తొట్టెలు, బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఐదవ బోనం సమర్పించారు. సబ్జిమండీ నుంచి కార్వాన్, లంగర్‌హౌస్ మీదుగా గోల్కొండ కోటకు పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య తరలివెళ్లారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గుడమోని అశోక్ కుమార్, ఎల్లమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుడుముల రాకేశ్, ప్రధాన కార్యదర్శి అల్లె వినోద్ కుమార్, ఉమ్మడి ఆలయాల పూజా కమిటీ అధ్యక్షుడు గాండ్ల నిరంజన్ బాబు, ప్రధాన కార్యదర్శి దొర్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల్సుంపురా ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.