ఎల్బీనగర్, జూన్ 28: ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఏడు సుందరమైన పార్కులు, క్రీడాకారులను తీర్చిదిద్దేలా ఐదు ప్లే గ్రౌండ్స్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో నియోజకవర్గంలోని పార్కులు, ప్లే గ్రౌండ్స్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన పార్కులను అందుబాటులోకి తేవడంతో పాటు క్రీడాకారులను తయారు చేసే క్రీడా ప్రాంగణాలను కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. హయత్‌నగర్ డివిజన్లోని కమర్శియల్ టాక్స్ ఆఫీసర్స్ కాలనీ, తిరుమలనగర్, మన్సూరాబాద్ డివిజన్లోని ఆర్టీసీ సూపర్వైజర్స్ కాలనీ, బాలాజీనగర్ కాలనీ, కొత్తపేట డివిజన్లోని ఎస్ఆర్ఎల్ కాలనీ, నాగోలు డివిజన్లోని విశాలాంధ్ర నగర్, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని బీఎన్రెడ్నిడరగ్ ఫేజ్-3 కాలనీల్లో మొత్తం ఏడు పార్కులు అభివృద్ధి చేయనున్నామని తెలిపారు.
అదే విధంగా బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ డీపీఎస్ స్కూల్ వద్ద ప్లే గ్రౌండ్, వైదేహీనగర్ వాలీబాల్ ప్లే గ్రౌండ్, గాయత్రీభవన్ ప్లే గ్రౌండ్, శివాజీ పార్కు ప్లే గ్రౌండ్, సంపూర్ణ ప్రాంతంలో నూతన ప్లే గ్రౌండ్ మంజూరయ్యాయని, ఈ మైదానాల్లో అధునాతన లైటింగ్‌తో తీర్చిదిద్దుతున్నామన్నారు. పార్కుల్లో పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు. పార్కులు, ప్లే గ్రౌండ్ పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని, పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. ఈ మేరకు అధికారులకు పార్కులు, ప్లే గ్రౌండ్స్ అభివృద్ధిని పక్కాగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డితో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.