సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): ఏ శుభకార్యానికైనా.. గణపతికే తొలి పూజ చేస్తాం. వినాయక చవితి ఉత్సవాల్లో ఊరూవాడా ప్రతిమలను ప్రతిష్ఠించి.. ఘనంగా పూజిస్తాం. అయితే విగ్రహాల తయారీలో వాడే రసాయనాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. వాటి నిమజ్జనంతో జల కాలుష్యం ఏర్పడుతున్నది. మహానగరంలో ఏటా కనీసం 3 లక్షలకు పైగా గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా, అందులో సుమారు 90 శాతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రూపొందించినవే ఉంటున్నాయి. అందుకే ఈ గణేశ్ నవరాత్రోత్సవాలను పర్యావరణహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభ్వుతం విశేషంగా కృషి చేస్తున్నది. ఇందులోభాగంగా బల్దియా అధికారులు సర్కిళ్ల వారీగా 8 ఇంచుల నుంచి 8 ఫీట్ల విగ్రహాల తయారీపై శిక్షణతో పాటు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో నగరవాసుల్లోనూ మార్పు కనిపిస్తున్నది. చైతన్యం వెల్లివిరుస్తున్నది. సహజసిద్ధ ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటున్నారు. ఎకో ఫ్రెండ్లీ గణపయ్యకే జైజై అంటున్నారు. మరోవైపు ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి సైతం ఈసారి 50 అడుగుల రూపంలో మట్టి విగ్రహం కొలువుదీరనున్నది.
హైదరాబాద్ మహా నగరంలో అతి పెద్ద ఆధ్యాత్మిక, సాం సృతిక ఉత్సవం గణేశ్ నిమజ్జన కార్యక్రమం. నగర సంసృతిలో భాగంగా ఉన్న ఈ గణేశ్ నిమజ్జనాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. ఇప్పటికే, హైదరాబాద్ నగరంలో మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించింది. ఏకో ఫ్రెండ్లీ మట్టి గణేశ్ ప్రతిమల తయారీకి ఆసక్తి ఉన్న వారికి సరిళ్ల వారీగా శిక్షణతో పాటు అవగాహన కల్పిస్తున్నారు. 8 ఇంచుల నుంచి 8 ఫీట్ల వరకు తయారు విధానాలపై శిక్షణ కల్పిస్తున్నారు.
నగరంలోని హుస్సేన్ సాగర్‌తో సహా ఏ చెరువులోనూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రూపొందించిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జా రీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి హైకోర్టు ఈ ఆదేశాలు గత సంవత్సరమే ఇచ్చింది. అయితే, అప్పటికే వినాయక చవితి సమీపించడంతో పీఓపీతో తయా రు చేసిన విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేమ ని, ఈ సారికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ యం త్రాంగం కోరడంతో గత సంవత్సరం మాత్రమే చివరి నిమిషంలో హైకోర్టు అనుమతించింది.
ఖైరతాబాద్ భారీ విగ్రహంతో తొలి ఫలితం
హైదరాబాద్ మహా నగరంలో ప్రతి సంవత్సరం కనీసం 3 లక్షలకు పైగా గణేశ్ మండపాలు పెడుతున్నా రు. ఈ విగ్రహాల్లో దాదాపు 90 శాతం ప్లాస్టర్ ఆఫ్ పారి స్ తోనే తయారి చేసినవి ఉంటున్నాయి. ఈ విగ్రహాలను ట్యాంక్‌బండ్‌తో సహా ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా ఈ విగ్రహాల తయారీలో ఉపయోగించే జిప్సం, రసాయన మిశ్రమాలతో నీటిలోని వి ష పదార్ధాల స్థాయి పెరిగి చేపలతో సహా ఏ జీవాలు కూడా మనుగడ సాధించలేని పరిస్థితి నెలకొంది. ఈ పీఓపీతో తయారీని నియంత్రించేందుకు ప్రభుత్వ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. ఈ విషయంలో నగరంలో అతి పెద్దదైన ఖైరతాబాద్ గణేశ్‌ను ఈసారి 50 అడుగుల ఎత్తులో మట్టి తో తయారు చేయనున్నట్లు ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించడం ప్రభుత్వ కృషికి తొలి ఫలితం.
30 చోట్ల గణేశ్ నిమజ్జన కొలనులు
వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యాన్ని నివారించేందుకు జీహెచ్ఎంసీ దాదాపు 30 గణేశ్ నిమజ్జన కొలనులు నిర్మించింది. ఈ నిమజ్జ నం కొలనులో గత 2021లో 70 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం చేశారు. దీనితో, నగరంలోని చెరువుల్లో కాలుష్యం తగ్గేందుకు దోహదపడ్డాయి. కాగా, గణేష్ నిమజ్జనం ముగియగానే ఒక హుస్సేన్ సాగర్ చెరువు లో నుంచే 5800 టన్నుల పీఓపీ, ఇతర నిమజ్జన వ్యర్థాలను తొలగించారు. ఈ కొలనులో చిన్న విగ్రహా ల నిమజ్జనం చేస్తూ, స్థానిక చెరువులలో చేయకపోవ డంతో కాలుష్య నివారణకు తోడ్పడుతున్నాయి.
చవితి ఉత్సవాలపై..
వచ్చే సెప్టెంబర్ నెలలో జరిగే చవితి ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటీవల ఉన్నత స్థా యి సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఓపీతో విగ్రహాలు తయారుచేయకుండా తయారీదారులను చైతన్య పర్చాలని అదే విధంగా గణేష్ పండగ నిర్వాహకులకు కూడా అవగాహన, చైతన్యం కల్పించాలని నిర్ణయించారు.
ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే పూజిద్దాం మేయర్ విజయ లక్ష్మి
చవితి పండుగ సందర్భంగా ఏకో ఫ్రెండ్లీ మట్టి గణపతినే పూజించాలని నగర మేయర్ విజయ ల క్ష్మి ప్రజలను కోరారు. జీ హెచ్ఏంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏకో ఫ్రెండ్లీ మట్టి గణపతి ప్రతిమను పరిశీలించారు. కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏకో ఫ్రెండ్లీ మట్టి గణేశ్ ప్రతిమల తయారీపై ఆసక్తి ఉన్న వారికి సరిల్ వారీగా శిక్షణతో పాటు అవగాహన కల్పించినట్లు 8 ఇంచుల నుంచి 8 ఫీట్ల వరకు తయారు విధానాల పై శిక్షణ కల్పించినట్లు తెలిపారు. జోనల్ స్థాయిలో ఒకటి, సరిల్ స్థా యిలో రెండు ముఖ్య ప్రదేశాలలో, వ్యాపార కూడలి, పెద్ద వాణిజ్య సంస్థల ఆవరణలో మట్టి విగ్రహాల ప్రతిమల ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు మేయర్ పేరొన్నారు. కావాల్సిన వారికి మట్టి విగ్రహాల తయారీ సంస్థల మొబైల్ నంబర్లను అకడ పొందపరిచినట్లు మేయర్ పేరొన్నారు.