కొండాపూర్, జూన్ 24 : పట్టాలు అందుకుంటున్న ప్రతి విద్యార్థి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుని వాటి సాధన దిశగా ముందుకు సాగాలని తెలంగాణ హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ వెంకట రమణ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వార్షిక, గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడు తూ.. విద్యార్థులు యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధించి కళాశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నా రు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ బి. శ్రీనాగేశ్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ అనంతరం తరగతి గది నుంచి వర్క్‌ప్లేస్‌కు మారుతారని, వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుందన్నారు.
మెథడిస్ట్ కరస్పాండెంట్ కే కృష్ణారావు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు విద్యా బోధనతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని అన్నారు. కళాశాలలోని ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు లభించేలా కార్పొరేట్ సంస్థలచే క్యాంపస్ ప్లేస్మెంట్లకై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అనంతరం 2021, 22 అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడంతో పాటు ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రాకేశ్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రభు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, ఏఓ రమేశ్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.