మెహిదీపట్నం, జూన్ 23 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్‌రావు అన్నారు. గురువారం నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్ హాకీగ్రౌండ్లో దళితబంధు లబ్ధిదారులకు కార్లు, ఆటోలను ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్‌రావు ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్, టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్‌తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఎస్.ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. దళితబంధు పథకం దేశంలో ఎక్కడాలేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలులో ఉందన్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ పథకంలో లబ్ధి పొందారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మెరాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుతో లబ్ధిదారుల్లో సంతోషం కనిపిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోఎస్సీ కార్పొరేషన్ అధికారులతోపాటు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్, ఎంఐఎం కార్పొరేటర్ల ప్రతినిధులు జాఫర్‌ఖాన్, ఎండీ.మూసా, సర్పరాజ్ సిద్ధిఖీ, టీఆర్ఎస్ నాయకులు సంజయ్, లక్ష్మీనారాయణ, యూసుఫ్, మెట్టువాల్మీకి, మాజీద్, ధరంవీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.