నేరేడ్మెట్, జూన్ 22: వానకాలంలో వరదనీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. బుధవారం వినాయక్‌నగర్ డివిజన్ దీన్‌దయాల్‌నగర్‌లో మంగళవారం కురిసిన వర్షానికి జలమయమైన ప్రాంతాలను, ఓపెన్ డ్రైనేజీలను స్థానిక కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాక్స్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలుషిత నీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను జీఎంలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.
వానాకాలంలో సీవరేజీ ఓవర్ ప్లో, రోడ్లపై వర్షపు నీరు నిలువడం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు ప్రజల భద్రత కోసం జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. పనుల్లో నాన్యత పాటించి సకాలంలో పూర్తి చేసేలా ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ మహేశ్, ఏఈలు దీపక్, మధురిమ, నాగరాజు, కార్పొరేటర్ ప్రేంకుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, నాయకులు పరశురాంరెడ్డి, తులసి సురేశ్, ప్రభాకర్‌రెడ్డి, బాలకృష్ణ, చంద్రకాంత్, బాల్రాజుయాదవ్, సంతోశ్రాందాస్, సందీప్‌గౌడ్, రఘుయాదవ్, బీజేపీ నాయకులు ఓంప్రకాశ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.