ఎల్బీనగర్ జోన్‌బృందం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో రైతుబజార్ హుడా పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన ప్రాచీన ఆరోగ్య విధానమన్నారు. యోగా ద్వారా ఎన్నో రుగ్మతలను రూపుమాపవచ్చన్నారు. ఉచితంగా యోగా శిక్షణను అందజేస్తున్న సంస్థలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా సమతి ప్రధాన కార్యదర్శి గంగం శివశంకర్, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, బీఎన్‌రెడ్డినగర్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి, దొమ్మాటి సుదర్శన్‌బాబు, అమర్, రాంబాబు, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్ కమ్యునిటీ హాల్లో యోగా గురువు గణపురం కృష్ణ ఆధ్వర్యంలో ఆసనాలు వేయించి, యోగా విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం గ్రేటర్ అధ్యక్షుడు సంరెడ్డి భుజంగరెడ్డి, యుగంధర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీవోస్ కాలనీ, హరిహరపురం కాలనీల్లో బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, సాధకులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కాలనీలోని పింక్ అండ్ బ్లూ స్కూల్లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పాల్గొని మాట్లాడారు. వయసుతో సంబంధం లేకుండా యోగా సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు, ముకుందరావు, అనుషారెడ్డి, అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగోల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.శ్రీదేవి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు యోగా చేయడాన్ని అలవర్చుకోవడమే కాకుండా తమ కుటుంబసభ్యులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ వనజ, పారా లీగల్ వలంటీర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్‌కాలనీలో యోగా గురువు భరత్‌భూషన్ ఆధ్వర్యంలో వివిధ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కరణం శ్రీకాంత్, కాలనీవాసులు గంగదాసు కృష్ణారెడ్డి, మింటు, రాఘవేందర్, మేకల ప్రభాకర్‌రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, విశ్వనాథ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో హయత్‌నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు ఈ ఎస్ ఆర్ మూర్తి, విజయ ప్రతాప్, శ్రీనివాస రావు, పాఠశాల హెడ్మాస్టర్ భాస్కర్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సరూర్‌నగర్ ప్రియదర్శినీ పార్కులో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావుతో పాటు పలువురు పాల్గొని యోగాసనాలు వేశారు. గడ్డిఅన్నారం డివిజన్లో కార్పొరేటర్ బద్దం ప్రేం మహేశ్వర్‌రెడ్డి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.
జిల్లా కోర్టులో..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా కోర్టులో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి అధ్యక్షతన కాన్ఫరెన్స్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఆర్.తిరుపతి, న్యాయమూర్తులు రాధాకృష్ణ చౌహన్, మిలింద్ కాంబ్లీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోటపల్లి భాస్కర్‌రెడ్డి, నూతన అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, దేవరాజ్‌గౌడ్, సుధారాణి, వనజ తదితరలు పాల్గొన్నారు.