బంజారాహిల్స్,జూన్ 21: తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఖైరతాబాద్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న 21మంది లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే దానం చెక్కులు అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులను అందించిన అనంతరం ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నారన్నారు. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు అనేక రకాలైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, నాయకులు వెంకటేష్, నాగేశ్వర్రావు, ప్రసాద్, మెట్టు రాజు, పులి సంతోష్, అనిల్, మురళీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటికెళ్లి కల్యాణలక్ష్మి చెక్కు అందజేసిన కార్పొరేటర్
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పంజాగుట్ట ప్రతాప్‌నగర్ బస్తీకి చెందిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధ్దిదారుకు మంజూరైన చెక్కును కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఆమె ఇంటికెళ్లి అందజేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికోసం ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల కష్టాలు తీరుతున్నాయని కార్పొరేటర్ పేర్కొన్నారు. వీఆర్వో రాములుతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.