ఎర్రగడ్డ, జూన్ 20 : సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండలో 34 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న అనేక పథకాలు పేద కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయని గుర్తు చేశారు. బోరబండ డివిజన్లో అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా తన వంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆర్ఐ సందీప్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, లక్ష్మణ్‌గౌడ్, ఏడీ మధు, ఆనంద్, రవినాయుడు, లడ్డు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ పునఃనిర్మాణానికి భూమి పూజ
బోరబండ బస్‌స్టాండ్ సమీపంలో వివిధ దేవతామూర్తులు కొలువైన ఆలయాల ప్రాంగణం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నది. ఇందులో ఆంజనేయస్వామి ఆలయం చాలా పురాతనమైనది కావడంతో అదే స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించటానికి కమిటీ నిర్ణయించింది. ఆంజనేయస్వామి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం భూమి పూజ చేశారు. నిర్మాణ దాతలను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, ఆలయ కమిటీ సభ్యులు రమేశ్, జంగయ్య, రాములు, ధనలక్ష్మి, జస్వంత్‌రెడ్డి, ప్రధాన అర్చకులు హేమకేశవాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డలో పార్కుల అభివృద్ధి..
ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ కాలనీలోని 2, 3వ పార్కుల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధిలో భాగంగా గ్రిల్స్ ఏర్పాటు కోసం రూ.35.20 లక్షలను మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్‌బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్‌షరీఫ్, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సంజీవ, షరీఫ్ఖురేషీ, బల్దియా ఏఈ రామచంద్రరాజు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వినయసాగర్, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
వెంగళరావునగర్, జూన్ 20 : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం వెంగళరావునగర్ డివిజన్ జవహర్‌నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన 4వ బ్రహ్మోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే మాగంటి పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భక్తుల కష్టాలను తొలగించే దైవంగా శ్రీవేంకటేశ్వర స్వామిని విశ్వసిస్తారని అన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, జీటీఎస్ దేవాలయ చైర్మన్ చిన్న రమేశ్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణు, సీనియర్ నాయకులు వేణు గోపాల్ యాదవ్, సత్యనారాయణ, పవన్ మదిరాజ్, ఆలయ కమిటీ చైర్మన్ పాపయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.