అమీర్పేట్, జూన్ 20 : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోరబండ సమీపంలోని ఆర్కే సొసైటీలో ఫయాజ్ ఖాన్(33) తన తల్లి భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఏ పని చేయకుండా ఉంటున్న ఫయాజ్ఖాన్ను భార్య అనేక మార్లు పద్ధతి మార్చుకోవాల్సిందిగా కోరింది. అయినా ఫయాజ్ఖాన్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.
దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి భార్య పుట్టింకి వెళ్లిపోయింది. భార్య ఇంటికి వచ్చేందుకు నిరాకరించడంతో ఫయాజ్ఖాన్ మనోవేదనకు గురై ఆదివారం రాత్రి గది కిటికీకి తాడుతో మెడకు బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.