సికింద్రాబాద్, జూన్ 20: ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ సూచించారు. ఈ మేరకు సోమవారం డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలను ఉపాధ్యాయులతో కలిసి కార్పొరేటర్ హేమ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు బడి పరిసర ప్రాంతాల్లో చెత్త్తా చెదారం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవా లన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల వసతుల గురించి ఆరా తీసిన అమె నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈ కౌశిక్, ప్రిన్సిపాల్ కృష్ణ మూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.