సిటీబ్యూరో,జూన్ 20 (నమస్తే తెలంగాణ): నగరంలోని పలు పార్కుల ఆధునీకరణపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు పార్కుల్లో మెరుగైన మౌలిక వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నది. సరూర్‌నగర్, వనస్థలిపురం, సాయినగర్, నారాయణగూడ, రాజేంద్రనగర్, సఫిల్‌గూడ ప్రాంతాల్లోని పార్కుల్లో అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.1.45 కోట్లు ఖర్చు చేయనున్నారు. పార్కుల అభివృద్ధితో పాటు పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నారు.
పార్కుల స్థలాలను పరిరక్షించడంతో పాటు నిత్యం ఆయా పార్కులు పచ్చదనంతో నిండి ఉండేలా, సందర్శకులు వచ్చివెళ్లేందుకు అనువుగా ఉండేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నారు. ఇందుకోసం సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్ పార్కులో సుమారు రూ.50 లక్షలతో వివిధ పనులు చేపడుతున్నారు. మొత్తం 12 చోట్ల చేపట్టే పనులకు మొత్తం రూ.1.45 కోట్లను హెచ్ఎండీఏ ఖర్చు చేయనున్నది. ఈ పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచిన హెచ్ఎండీఏ అధికారులు, జూలై మొదటి వారం తర్వాత పనులు చేపట్టనున్నారు.
హెచ్ఎండీఏ చేపట్టే అభివృద్ధి పనులు…