సిటీబ్యూరో, జూన్ 20(నమస్తే తెలంగాణ)/చర్లపల్లి: విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెస్మెంట్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. కాప్రా సరిల్లో ఏఎస్ రావు నగర్, ఉప్పల్ సరిల్ రామంతాపూర్లో ఏర్పా టు చేసిన క్యాంపులను మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అసెస్మెంట్ క్యాంపు ఈ నెల 20 వ తేదీ నుంచి జూలై 7 వరకు ప్రతి రోజూ రెండు సరిల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి క్యాంపులో నిర్వహిస్తున్నారని, నిర్దేశించిన లక్ష్యం కంటే ఎకువగా క్యాంపులకు వచ్చిన వారందరికీ పరీక్షలు చేయాలని నిర్వాహకులు కోరారు. అలీమ్ జీహెచ్ఏంసీ సమన్వయంతో క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వివిధ రకాల అంగ వైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్ లేకున్నా వారికి పరీక్షలు చేసిన వారికి సర్టిఫికేట్ కోసం సదరం క్యాంపులకు సిపార్స్ చేయాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష, స్వర్ణరాజ్, బొంతు శ్రీదేవి, శాంతి శైజెన్, దేవేందర్ రెడ్డి, గీత ప్రవీణ్ , శ్రీవాణి, చేతన, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, జోనల్ కమిషనర్ పంకజ ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య డిప్యూటీ కమినర్లు తదితరులు పాల్గొన్నారు.