రవీంద్రభారతి, జూన్ 20: జీవితంలో ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ఓ స్త్రీ మూర్తి సహకారం తప్పకుండా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సౌజన్యంతో జలదంకి పద్మావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జలదంకి పద్మావతి స్మారక సాహితీ పురస్కార మహోత్సవం సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్దాంగి ప్రత్యేక కథల పుస్తకాన్ని ప్రముఖ సినీ రచయిత, నటుడు నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ జీవితంలో మనిషి విజయాలు సాధించడం వెనుక ఒక మహిళామూర్తి ఉంటారని, అలా జలదంకి సుధాకర్ వెనుక పద్మావతి ఉన్నారని చెప్పారు.
నాటక, సినీ సాహిత్య రంగాలలో సుధాకర్ రచయితగా ఎదగడానికి నిరంతరం ఆమె సహకరించారని తెలిపారు. సుధాకర్ జీవితంలో పద్మావతి ఒక గొప్ప వ్యక్తిగా అన్నీ తానే అయ్యి ఎంతో కృషి చేశారని చెప్పారు. సాహిత్య రంగంలో ఆమెను చూసుకోవాలన్న ఆశతో, ఆమె జ్ఞాపకార్థం ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో నిర్వహించిన కథల పోటీలత సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ రమణాచారి, సహ ధర్మచారిణి లతారలో పాల్గొని, బహుమతులు అందుకొని అర్ధాంగి కథా సంకలనంలో చోటు దక్కించుకున్న 25 మంది కథా రచయితలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సభలో ప్రముఖ సాహితీవేత్త డా॥ ఓలేటి పార్వతీశం, సినీగేయ రచయిత, ఈదా నిర్మల, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, గంగులపూడి గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.