రవీంద్రభారతి, జూన్ 20 : తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ మునీశ్వరుడిగా కీర్తింపబడిన చందాల కేశవ దాసు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ హాజరై కేశవదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మహబూబ్‌నగర్ మాజీ ఏఎంసీ చైర్మన్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
27న సత్య శ్రీనాథ్ థియేటర్ మ్యూజికల్ నైట్
తెలంగాణ ప్రభుత్వం, భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ నెల 27న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్న సత్యశ్రీనాథ్ థియేటర్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను సోమవారం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాహి త్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శిల్పకళా ప్రదర్శనను సందర్శించిన మంత్రి
భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో గోపాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి నిర్వహిస్తున్న శిల్పకళా ప్రదర్శనను రాష్ట్ర అంబార్కీ, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సోమవారం సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, భాషాసాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రవీంద్రభారతి సాంస్కృతిక శాఖ ఉద్యోగి గూడూరు హేమలతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.