సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): నీవు కరెంట్ బిల్లు చెల్లించలేదు.. 24 గంటల్లో బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ అవుతుందంటూ ఓ వ్యక్తికి మెసేజ్ పంపిన సైబర్‌నేరగాళ్లు, ఆయన బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 8.5 లక్షలు కాజేశారు. సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన బాధితుడి సెల్‌ఫోన్‌కు మీరు కరెంటు బిల్లు చెల్లించలేదని మెసేజ్ వచ్చింది. అందులో కాంటాక్టు నంబర్‌ను పొందుపర్చారు. ఆ నంబర్‌కు ఫోన్ చేయగా సైబర్ నేరగాళ్లు టీమ్ వ్యూహర్ యాప్‌ను డౌన్లోడ్ చేయించి బాధితుడి బ్యాంకు ఖాతాలోని రూ.8.5 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ కస్టడీలో 12 మంది సైబర్ చీటర్స్
ఓటీపీ, ఓఎల్ఎక్స్ వంటి సైబర్‌నేరాలకు పాల్పడిన 12 మంది సైబర్ నేరగాళ్లను జార్ఖండ్‌లోని పలు జైళ్ల నుంచి ఇటీవల ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలోని బృందం నగరానికి తరలించింది. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచి, అనంతరం జైలుకు పంపించారు. ఈ నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతి లభించడంతో సోమవారం 12 మంది సైబర్నేరగాళ్లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.