దుండిగల్, జూన్ 19: ఓ మహిళ పోగొట్టుకున్న నగల బ్యాగును సీసీ ఫుటేజీ ద్వారా గంట వ్యవధిలోనే గుర్తించి.. బాధితురాలికి అప్పగించారు జీడిమెట్ల పోలీసులు. సీఐ బాలరాజు కథనం ప్రకారం… లావణ్య ఆదివారం ఉదయం ఆదర్శ్నగర్లో జరిగే ఫంక్షన్కు హాజరయ్యేందుకు తన స్కూటీపై బయలు దేరింది. ఆదర్శ్నగర్కు చేరుకున్నాక.. నగల బ్యాగు కనిపించలేదు. వెంటనే జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బాలరాజు నేతృత్వంలో బాధితురాలు ప్రయాణించిన మార్గంలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బ్యాగు హెచ్ఏఎల్ కాలనీ ప్రధానద్వారం వద్ద పడిపోయినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బ్యాగుతో పాటు అందులో ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలను లావణ్యకు అందజేయడంతో ఆమె ఆనందంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.