కవాడిగూడ, జూన్ 19: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారమే జరిగినదని, ఇది సీఎం ఓ కుట్రేనని బీజేపీ నాయకు డు బండి సంజయ్ ఆరోపించ డం సిగ్గుచేటని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు పులి గారి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇతర రాష్ర్టాల్లో కూడా విధ్వంసం జరుగుతుందని, ఇది ఎవరి కుట్రో? ‘బండే’ చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ప్రతి విషయాన్ని రాజకీయంతో ముడిపెట్టి నిందలు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడలోని అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ పథకాన్నైనా ప్రవేశపెట్టే ముందు ఆ పథకంపై విస్తృత ప్రచారం చేయాల్సిందని, అది చేయకుండా పథకాన్ని తీసుకువచ్చి అభ్యర్థులను అయోమయానికి గురి చేయడం అత్యంత దారుణమన్నారు. అగ్నిపథ్, ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబా ద్ రైల్వే స్టేషన్లో సృష్టించిన విధ్వంసాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తారని అన్నారు. ‘బండి’ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.