అబిడ్స్, జూన్ 19: విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు జాబ్‌మేళాలు ఎంతగానో దోహదం చేస్తాయని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖలీక్ ఉర్ రహమాన్ అన్నారు. ఈ మేరకు ఆదివారం టోలిచౌకిలోని వీఐపీ ఇంటర్నేషనల్ స్కూల్లో డెక్కన్ బ్లాస్టర్స్ వ్యవస్థాపకులు ఇంజనీర్ మన్నన్ ఖాన్ ఆధ్వర్యంలో 23వ ట్విన్ సిటీస్ మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. ఈ మేళాలో వెయ్యి మంది అభ్యర్థులు పాల్గొన్నారు. కాగా, ఈ మేళాలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో 200 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాసం పూర్తవుతున్న విద్యార్థులకు ఉపాధిని కల్పించేందుకు గాను జాబ్‌మేళాను నిర్వహించారు. అనంతరం, ఆయన ఆర్ఆర్ గ్రూప్ కంపెనీస్ డైరెక్టర్ జయ్యద్ ఇర్ఫాన్ ఉద్దీన్‌తో కలిసి ఈ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. డెక్కన్ బ్లాస్టర్ ఇంజనీర్ వ్యవస్థాపకులు మన్నన్ ఖాన్ ఇప్పటి వరకు మూడువేల మంది నిరుద్యోగ యువతకు ఎటువంటి ఫీజులు లేకుండా ఉపాధిని కల్పించడం అభినందనీయమన్నారు.