చంపాపేట, జూన్ 19: పార్టీకి కార్యకర్తలే ఆయువుపట్టని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ కమిటీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం డివిజన్ కమిటీ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్మన్‌ఘాట్‌లోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీకైన కార్యకర్తలే ఆయువు పట్టని అన్నారు. కార్యకర్తల కృషి లేకుంటే ఏ పార్టీకి మనగడ ఉండదన్నారు. కార్యకర్తలంతా సమన్వయంతో ముందుకు సాగితే పార్టీ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గజ్జెల మధుసూదన్‌రెడ్డి, నల్ల రఘుమారెడ్డి, పార్టీ డివిజన్ కమిటీ మహిళా వింగ్ అధ్యక్షురాలు రోజారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
హయత్‌నగర్, జూన్ 19: సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నియంత్రించవచ్చని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఇన్ఫర్మేషన్ కాలనీలో మారం ఆర్పీ హోమ్స్ తమ సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడంతోపాటు రాత్రిపూట దొంగతనాలను నివారించవచ్చని తెలిపారు.
కాలనీ కమ్యూనిటీ సంఘాలు, సొంత ఇండ్లవారు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు, హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, రొయ్య భాస్కర్, బాలకృష్ణ యాదవ్, పల్లెమోని మధు ముదిరాజ్, మారం ఆర్పీ హోమ్స్ అధ్యక్షుడు పల్లె మధు తదితరులు పాల్గొన్నారు.