సికింద్రాబాద్, జూన్ 17: కంటోన్మెంట్‌లోని ఒకటో వార్డు న్యూ బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్‌లో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. అంతకు ముందు ఉదయాన్నే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని మర్రి రాజశేఖర్‌రెడ్డి పలు ఆలయాల్లో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే ఇంటి నుంచి ర్యాలీగా నేతలు, కార్యకర్తలు మర్రి రాజశేఖర్‌రెడ్డిని గజమాలతో సత్కరించి మల్లారెడ్డి గార్డెన్‌కు తీసుకొచ్చారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మర్రి రాజశేఖర్‌రెడ్డికి పూలబొకేను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దీంతో పాటు ఎమ్మెల్యే సాయన్న, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఆయా చైర్మన్లు మర్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నళినికిరణ్, పాండుయాదవ్, లోక్నాథం, శ్యామ్‌కుమార్‌తో పాటు నేతలు ముప్పిడి మధుకర్, పెద్దాల నర్సింహ, లతామహేందర్, ప్రవీణ్‌యాదవ్, పిట్ల నగేష్, వెంకట్‌రెడ్డి, సందీప్‌గౌడ్, ప్రభాకర్, శ్రీకాం త్, భాస్కర్ ముదిరాజ్తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్ప ల్, కూకట్‌పల్లికి చెందిన యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మర్రి రాజశేఖర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు
మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తో సహా ఎమ్మెల్యేలు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వివేకానంద, సుభాష్‌రెడ్డి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.