ముషీరాబాద్/ చిక్కడపల్లి, జూన్ 17: పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీ, వినోబానగర్‌లో అధికారులతో కలి సి పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పుట్‌పాత్‌లపై మట్టికుప్పలను తొలగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పక్షం రోజులుగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని అన్నారు. కమలా నెహ్రూనగర్, వినోబానగర్లలో కలుషితనీరు. లో ప్రెషర్ సమస్యలను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, టీ.సోమసుందర్, శ్రీధర్‌రెడ్డి, దీన్‌దయాల్‌రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, ఎ. రాజు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో పరిసరాలు పరిశుభ్రం అవుతున్నాయని డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని అన్నా రు. గాంధీనగర్ డివిజన్లో శుక్రవారం పట్టణ ప్రగ తి కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంఓహెచ్ మైత్రే యి, డీఈ సన్నీ అధికారులతో కలిసి ఆమె పర్యటించి పరిసరాలను పరిశీలించారు. బీజేపీ నాయకుడు వినయ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు రత్నసాయిచంద్, శ్రీకాంత్, సత్తిరెడ్డి, రాజేందర్, నర్సింహ, సాయికుమార్, సూరి, సాయి, సంతోష్, ఆకుల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.