మహేశ్వరం, జూన్ 15: సంక్షేమ రంగానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్‌నగర్‌లో రూ.2.25కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి ఆరు నెలలకు ఒక సారి పల్లె, పట్టణ ప్రగతి పనులు జరుగుతున్నాయని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. తుక్కుగూడ అభివృద్ధికి రూ.34కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. దాదాపు సర్దార్‌నగర్ అభివృద్ధికి రూ.7కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
కరోనా తర్వాత సర్దార్‌నగర్‌కు బస్సులు నడపడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో, డిపో అధికారులతో మాట్లాడి బస్సులను నడిచేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని తెలిపారు. ఇండ్లులేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని చెప్పారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 52 కంపెనీల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 80వేల ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరూ నైపుణ్యతతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని యువకులకు సూచించారు.
పట్టణ ప్రజలకు ఇబ్బందులు రాకుండా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను ప్రవేశ పెట్టామని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. దశలవారీగా తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్ వైస్ చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు రెడ్డిగళ్ల సుమన్, బాధావత్ రవినాయక్, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్, బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌గౌడ్, రాజమోని రాజు, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామ్యూల్ రాజు, నాయకులు బాట సురేశ్, పెంటమల్ల సురేశ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పునూతల శ్రీనివాస్, నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు యాదగిరి, నర్సింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.