
జూబ్లీహిల్స్, జనవరి 31: స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు విరివిగా బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్నట్లు యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ హిమబిందు తెలిపారు. సోమవారం యూసుఫ్‌గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో స్వయం సహాయక సభ్యుల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రూ.8.50 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించినట్లు తెలిపారు. గతంలో రుణాలు పొందిన గ్రూపులు వాటిని తిరిగి చెల్లించి, కొత్త రుణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్వయం సహాయక గ్రూపుల సభ్యులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేలా గ్రూపు లీడర్లు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 గ్రూపులకు రూ. 1 కోటికి పైగా రుణాలను అందించేందుకు లబ్ధిదారుల దరఖాస్తు పత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ ప్రతినిధి ఈ.రాజేశ్వరి, యూసీడీ సిబ్బంది పాల్గొన్నారు.