మేడ్చల్ జోన్ బృందం, జూన్ 14 : ప్రతి గడపను తట్టి సమస్యలను తెలుసుకొని, పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రజాప్రతినిధులు తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్, ప్రత్యేక అధికారి రాంచందర్, కమిషనర్ రాములు, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఈఈ నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.