మారేడ్‌పల్లి/అడ్డగుట్ట,, జూన్ 7: ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి ద్వారా పెను మార్పులు జరుగనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. పట్టణ ప్రగతి నాలుగో విడుత కార్యక్రమంలో భాగంగా మంగళవారం మోండా డివిజన్ వెస్ట్‌మారేడ్‌పల్లి లోని ఎల్ శంకర్ నగర్ బస్తీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి బస్తీలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా పేరుకుపోయిన చెత్త,చెదారాన్ని సిబ్బంది తొలగించారు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…బస్తీ, కాలనీల్లో చెత్తా చెదారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన ప్రణాళికలు సిద్ధ్దం చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. మోండా డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజినీర్లు సుదర్శన్, ఆంజనేయులు, రవీందర్, జలమండలి ఏఈ హకీం, టీఆర్ఎస్ నాయకులు టీఎన్, శ్రీనివాస్, ఆకుల హరికృష్ణ, పిట్ల నాగేష్ ముదిరాజ్, సీఎన్, నర్సింహ ముదిరాజ్, సి, సంతోష్ యాదవ్, ఎర్రబెల్లి ఉపేందర్, సంతోష్, రాము, అజయ్, భాస్కర్ ముదిరాజ్, సదానంద్‌గౌడ్, మహిళా నాయకురాల్లు నివేదిత , నాగినేని సరిత పాల్గొన్నారు.
శాంతినగర్‌లో..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు శాంతినగర్‌లోని లాలాగూడ బడి మజీద్, ఇంద్రానగర్ సీ, డీ కాలనీలలో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మితో కలిసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ… స్థానికంగా నెలకొన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దశరథ్, మెడికల్ అధికారి రవీందర్, నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, జీహెచ్ఎమ్సీ ఏఈ వేణు, పార్టీశ్రేణులు శ్రీనివాస్ గౌడ్, సత్తయ్య గౌడ్, పొన్నాల రాజు, ఎల్లయ్య, ప్రవీణ్, శివకుమార్, నర్సింగ్, గోనె శ్రీను, సంతోష్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయాలి
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా తార్నాక డివిజన్ లాలాపేటలో ఉన్న జయశంకర్ స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. లాలాపేట చౌరస్తాలో ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఏఎంవోహెచ్ డాక్టర్ రవీందర్‌గౌడ్, ఏఈ వెంకటేశ్, శానిటేషన్ సూపర్వైజర్ ధనాగౌడ్ పాల్గొన్నారు.