సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ ) : పట్టణ ప్రగతి.. గ్రేటర్ పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి దోహదపడుతున్నది. ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి అవసరమైన పనులను చేపడుతున్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా విజయవంతం చేశారు. పారిశుధ్య నిర్వహణ, మొకలు నాటే స్థలాల గుర్తింపు, పట్టణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు, పూడిక తీత, గుంతలు పూడ్చడం లాంటి పనులు చేపట్టారు.
పట్టణ ప్రగతిలో ఐదో రోజు చేపట్టిన కార్యక్రమాలు