మల్కాజిగిరి, జూన్ 7: హనుమాన్ దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డును తెరవాలని ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సాయన్న అన్నారు. మంగళవారం వెంకటాపురం డివిజన్ సుభాష్‌నగర్‌లోని హనుమాన్ దేవాలయానికి వెళ్లడానికి వీలులేకుండా గోడను కట్టడంతో దానినితొలగించాలని కోరుతూ సుభాష్‌నగర్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ హనుమాన్ దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా స్థల యజమానులు, కంటోన్మెంట్ అధికారులు గోడను తొలగించాలని అన్నారు. వారం రోజుల్లో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని, సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్‌కిశోర్, టీఎన్ శ్రీనివాస్, సంతోష్, రమేష్, శ్యాంసుంధర్, రఘునాథ్, ప్రభాకర్, దేవ, ఈఎస్ లక్ష్మణ్, ఈ జనార్దన్, మోసిన్, కిట్టు, సురేష్, అనిల్, మైవన్, జమేదార్, సాయికుమార్, షేక్, నాయక్, రమ్, వంశీ, లక్ష్మి, ఉదయ, రమ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.