
మెహిదీపట్నం, జనవరి 31 : ప్రజల సంక్షేమం కోసం అధికారులు శ్రమించాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకి, నానల్‌నగర్ డివిజన్లలో ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్, కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనులను వేగంగా, నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
డివిజన్లో అభివృద్ధికి కృషి
నాంపల్లి నియోజకవర్గం రెడ్‌హిల్స్ డివిజన్లోని సితార హోటల్, టీన్పోష్ మసీద్ ప్రాంతాల్లో రూ. 2 కోట్ల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ పరిశీలించారు. సీవరేజీ లైన్లు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి ఆరిఫ్ రిజ్వాన్‌తో కలిసి పరిశీలించారు. పనులలో నాణ్యతను పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.