మహేశ్వరం జోన్‌బృందం, జూన్ 4: స్వచ్ఛ పట్టణాలుగా, స్వచ్ఛ మున్సిపాలిటీలుగా మార్పు రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదట బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాల వేసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 16,17,18,19,20 వార్డుల్లో రూ.1.50కోట్ల వ్యయంతో చేపట్టబోయే బీటీ, సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. శ్రీరామకాలనీలో రూ.18లక్షలతో నిర్మించిన డ్రైనేజీ అభివృద్ధి పనిని ప్రారంభించి.. మొక్కలను నాటారు. అనంతరం మంత్రి సబిత మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇటీవల జల్పల్లి మున్సిపాలిటీకీ భారీగా నిధులు ఇచ్చారని త్వరలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కారిస్తానని తెలిపారు.
స్వచ్ఛ పట్ణణాలుగా మార్చటమే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హనా నాజ్, కమిషనర్ జీపీ కుమార్, కౌన్సిలర్లు బుడుమాల యాదగిరి, అనగండ్ల ప్రశాంతి, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, భాషమ్మ, శంషోద్దీన్, ఖాలెద్ బిన్ అబ్దుల్లా, టీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, దూడల సుధాకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, వాసుబాబు, ఖైసర్బామ్, విస్కమూరి నిరంజన్, దామోదర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు శ్రీధర్‌గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు యంజాల అర్జున్, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో సర్వతోముఖాభివృద్ధి..
పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం 22వ డివిజన్ శివనారాయణపురం కాలనీ, 19వ డివిజన్ లోకాయుక్త కాలనీ, 23వ డివిజన్ బీరప్ప కాలనీ, 28వ డివిజన్ లిబ్రా ఎన్క్లేవ్ కాలనీలో బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ అశోక్‌రెడ్డి, కార్పొరేటర్ లిక్కి మమతాకృష్ణారెడ్డి, రాళ్లగూడెం సంతోష శ్రీనివాస్‌రెడ్డి, సుర్ణగంటి అర్జున్, ఏఈఈ రాంప్రసాద్‌రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
పట్టణాలు అభివృద్ధి..
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ డివిజన్లో కౌన్సిలర్ బాధావత్ రవినాయక్‌తో కలిసి తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ జ్ఞానేశ్వర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూమి యాదగిరి, దొంతర మోని కార్తిక్, సురేశ్, శిరీశ్, సందీప్, గేమియానాయక్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి శనివారం కటికపల్లి గ్రామంలో సర్పంచ్ బుడ్డొల్ల నరేందర్‌గౌడ్‌తో కలిసి సమస్యలను సర్పంచులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బడీడు పిల్లలను పాఠశాలకు పంపించాలి..
బడీడు పిల్లలను పాఠశాలలకు పంపించాలని జంగారెడ్డి కోరారు. రాచులూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బుడ్డొల్ల నరేందర్‌గౌడ్, శ్రీనివాసచారి, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తిక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, వార్డు మెంబర్లు, పల్లె ప్రగతి ఇన్చార్జి, అధికారులు, పంచాయతీల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి..
సరూర్‌నగర్ డివిజన్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ పాల్గొన్నారు.