కుత్బుల్లాపూర్ జోన్ బృందం, జూన్ 4: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, డీసీ ప్రశాంతి నేతృత్వంలో చంద్రగిరినగర్‌లో పర్యటించి మొక్కలు నాటారు. స్థానిక సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వాటిని పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈఈ గోవర్ధన్, ఎలక్ట్రికల్ ఏఈ సత్యనారాయణ, వాటర్ వర్క్స్ డీజీఎం రాజేశ్, ఏఈ కళ్యాణ్, సత్యనారాయణత పాటు ఆయా శాఖల అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్లో కార్పొరేటర్ కొలుగుల జగన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
డివిజన్ బ్యాంకు కాలనీలో వార్డు మెం బర్, కాలనీ అధ్యక్షులు సుధాకర్‌గౌడ్, కృష్ణగౌడ్, వెంకట్‌రెడ్డి, పి.శ్రీనివాసరావుతో పాటు సర్కిల్ అధికారులు నేతృత్వంలో పర్యటించారు.
మున్సిపాలిటీ 14వవార్డులో వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, 18వ వార్డులో కౌన్సిలర్ డప్పు కిరణ్‌కుమార్ ఆయా కాలనీల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, కమిషనర్ రఘుల ఆధ్వర్యంలో ఆయా విభాగాల అధికారులకు పలు కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో చర్చించారు.
డివిజన్ బ్యాంకు కాలనీలో వార్డు మెం బర్, కాలనీ అధ్యక్షుడు సుధాకర్‌గౌడ్, కృష్ణగౌడ్, వెంకట్‌రెడ్డి, పి.శ్రీనివాసరావుతో పాటు సర్కిల్ అధికారులు నేతృత్వంలో పర్యటించారు.
కాలనీలో జరిగిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు స్థానికంగా సీసీ రోడ్లు పూర్తి చేయాలని కాలనీ వాసులు కోరాగా స్పందించిన ఎమ్మెల్యే రూ.35 లక్షలు మంజూరు చేయించి సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గాజులరామారం సర్కిల్ డీసీ ప్రశాంతి, డీఈ గోవర్ధన్, ఎఎంసీ శ్రీనివాస్, ఎఈ సంపత్, జలమండలి మేనేజర్ పూజిత, శానిటేషన్ డీఈ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్ డివిజన్ పరిధి అపురూపకాలనీ, ఎస్‌ఆర్‌నాయక్‌నగర్, జనప్రియ, మోదీ అపార్టుమెంట్స్, రామిరెడ్డినగర్లలో శనివారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులతో కలిసి మాజీ కార్పొరేటర్ జి.సురేశ్‌రెడ్డి పర్యటించారు. డీసీ మంగతాయారు, డీఈఈ పాప మ్మ, టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి ప్రభావతి, జల మండలి మేనేజర్ రాజు, ఎస్ఎఫ్ఎ యాద మ్మ, నాయకులు రమణ, పి. రవీందర్‌రెడ్డి, రా జు, చారి తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో…
అభివృద్ధి, పరిశుభ్రత లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధి 18వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కొలన్ వీరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మేయర్ నీలాగోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేషన్ సీటీ ఫ్లానర్ శ్రీనివాస్,వాటర్ వర్క్స్ డీజీఎంలు సరిత, సాయిరామ్‌రెడ్డి, డీఈ, దాసయ్య, నిజాంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్,రవికాంత్, డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్, అనుబంధ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో…
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ,3వ వార్డుల్లో జరిగిన కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ ఆధ్వర్యంలో 2వ వార్డులో పైపులైన్ లీకేజీ, డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, శ్మశాన వాటిక వద్ద బోరు ఏర్పాటు, స్నానపు గదులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం, విద్యుత్ స్తంభాలపై కిందకు జారిన వైర్లను సరిచేయడం వంటి సమస్యలను గుర్తించారు. అదే విధంగా 3వ వార్డులో పెద్ద చెరువు కల్వర్టు, మురురునీటి కాలువలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కమిషనర్ భోగీశ్వర్లు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ,అమరం గోపాల్‌రెడ్డి, జక్కుల కృష్ణయాదవ్,ఆనంద్, జక్కుల విజయ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో…
కొంపల్లి మున్సిపాలిటీ 14వవార్డులో వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, 18వ వార్డులో కౌన్సిలర్ డప్పు కిరణ్‌కుమార్‌లు ఆయా కాలనీల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, కమిషనర్ రఘుల ఆధ్వర్యంలో ఆయా విభాగాల అధికారులకు, సిబ్బందికి ప్రజల సమస్యల సేకరణలో పలు కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో చర్చించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి
పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు భారం కాకూడదనే సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాన్ని తీసుకువచ్చారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ. 70.8 లక్షల విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కులను మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే వివేకానంద్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ భూపాల్, కమిషనర్ భోగీశ్వర్లు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, భరత్‌కుమార్, మహేందర్‌యాదవ్, సాయియాదవ్, గోపాల్‌రెడ్డి, ఆనంద్, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, బౌరంపేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
వేంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు..
గాజులరామారం డివిజన్ పరిధిలోని మిథిలా నగర్లో సంతాన సంపద వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన పద్మావతి గోదా సమేత సంతాన సంపద వేంకటేశ్వ స్వామి వార్షిక బ్రహోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ఆలయ కమిటీ సభ్యులు సురేశ్, రామకృష్ణ, శ్రీనివాస్, రాయుడు, రాంబాబు, శ్రీకర్‌గుప్తా పాల్గొన్నారు.