దుండిగల్, జూన్ 3: దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల 17వ వార్షిక వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఈపామ్ సంస్థ సీనియర్ రిసోర్స్ డెవలప్మెంట్ మేనేజర్ ఇమాన్యూయేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన కేమ్ క్లబ్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సోలో డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, స్కిట్, సంగీత విభావరి ఆహూతులను ఉర్రూతలూగించాయి. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి, కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్‌రావు, కళాశాల కోశాధికారి మమతా రెడ్డి, డైరెక్టర్ శ్రేయారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.