ఖైరతాబాద్, జూన్ 3 : తెలంగాణ రాష్ర్టానికి యూకేకు చెందిన పది ఐటీ కంపెనీలు ఇక్కడ తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని ఐఫిన్ గ్లోబల్ గ్రూప్ సంస్థ సీఈవో శేషాద్రి వంగల తెలిపారు. ఇటీవల లండన్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారం ఆసియా ఎక్సలెన్స్ అవార్డుతో శేషాద్రి వంగలను సత్కరించింది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అనుభవాలను పంచుకున్నారు. 2022లో యూకే -భారత్ మధ్య వ్యాపారాత్మక సంబంధాలను నెలకొల్పడంలో తాను చేసిన కృషికి ఈ అవార్డు లభించిందన్నారు. అందులో భాగంగానే దేశానికి పలు కంపెనీలు రాగా, తెలంగాణ రాష్ర్టానికి గాను హైదరాబాద్‌కు పది సంస్థలు వస్తున్నాయన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ను దావోస్ వెళ్లే క్రమంలో కలిశానని చెప్పారు. యూకేకు చెందిన బహుళజాతి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందకు వస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం తరపున పూర్తి ప్రోత్సాహం ఉంటుందని ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ హామీ ఇచ్చారన్నారు. గతేడాది తమ కంపెనీ తరపున జేఎన్టీయులో జాబ్ ఫేయిర్ నిర్వహించామని, 25వేల మందికి ప్లేస్మెంట్ కల్పించా