దుండిగల్ జూన్ 1: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. బుధవారం పలు అసోసియేషన్ల సభ్యులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీని కలిసి సమస్యలను విన్నవించారు. కుమ్మరి కులస్తులకు శ్మశాన వాటికను కేటాయించాలని దుండిగల్ మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం నాయకులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రవీందర్‌యాదవ్, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, జక్కుల కృష్ణాయాదవ్, గోపాల్‌రెడ్డిలు ఉన్నారు.
డివిజన్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు శంభీపూర్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును కలిసి విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సానుకూలంగా స్పందించారు.
హాలుకు స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాపు సంఘం నేతలు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును కలిసి విన్నవించారు. కాపు సంఘం నాయకులు చక్క సురేశ్‌బాబు, కొట్టే రమణ, పద్మప్రసాద్, రాయల్ సురేశ్, అనిల్‌కుమార్, విజయ్‌కుమార్, వేణు, నరసింహారావు, శివ తదితరులు ఉన్నారు.
కార్పొరేషన్ ప్రగతినగర్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్ అభిమాన సంఘం నాయకులు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుకు కలిసి విన్నవించారు. వైఎస్సార్ అభిమాన సంఘం నాయకులు నారాయణరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, సైదిరెడ్డి, రామకృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డిలు ఉన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతినగర్ బవార్చి సర్కిల్లో నేడు ఏర్పాటు చేయనున్న భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొలన్ గోపాల్‌రెడ్డి, ప్లోర్‌లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్, కార్పొరేటర్ చిట్ల దివాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్‌యాదవ్, బౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అనుబంధ కమిటీ నాయకులు పాల్గొన్నారు.