కందుకూరు, మే 30: తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల పరిధి సాయిరెడ్డిగూడ గ్రామ సర్పంచ్ మహేశ్, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని వివరించారు. గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై పని చేస్తున్నారని స్పష్టం చేశారు. ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీతో ఈ ప్రాంతానికి మహర్దశ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్తునేని విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్మ్రణారెడ్డి, రాములు, శ్రీను, రామకృష్ణ, వెంకటయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, సురుసాని సురేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.