దుండిగల్, మే 29: ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రామకృష్ణ, మనోహర్ ఒక ప్రత్యేక యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నగర శివారు నిజాంపేటలో నివాసముంటున్న భానుసాయిరాం అనే వ్యక్తికి యాప్ నిర్వహణ అనుమతి ఇవ్వడంతో నిజాంపేటకే చెందిన బొమ్మాళి మోహన్‌రావు(30), మోసుగంటి రిచర్డ్లను ఆపరేటర్లుగా నియమించుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు, బాచుపల్లి పోలీసులతో కలిసి శిబిరంపై దాడి చేసి భానుసాయిరాం, బొమ్మాళి మోహన్‌రావు, మోసుగంటి రిచర్డ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3. 63లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రధాన సూత్రధారులు భీమవరానికి చెందిన రామకృష్ణ, మనోహర్‌లు పరారీలో ఉన్నారు.