తెలుగుయూనివర్సిటీ, మే 30 : నాంపల్లి రైల్వేస్టేషన్ పార్కింగ్ స్థలంలో జోలిపాయింట్ సంస్థ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ఎలక్ట్రిక్ రీచార్జ్ సెంటర్‌ను సోమవారం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ ఏ.కె గుప్తా ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 23 సెంటర్లలో రీచార్జ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా 104 సెంటర్లు ఏర్పాటు చేశామని, త్వరలోనే ఈ సంఖ్య వెయ్యికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు ప్ర దీప్, బసవరాజ్, కృష్ణారెడ్డి, ప్రసాదరావు పాల్గొన్నారు.