మేడ్చల్ కలెక్టరేట్, మే 30 : ప్రభుత్వం పట్టణ ప్రజల సౌకర్యార్థం జిల్లాలో 14 కేంద్రా ల్లో స్పెసలిస్టు వైద్యుల చేత సా యంత్రం దవాఖానలను ఏర్పాటు చేసిందని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. పుట్ల శ్రీనివాస్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం స్పెషలిస్టు దవాఖాన వైద్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 14 కేంద్రాలలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గైనకాలజిస్టులు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, ఆర్ధోపెడీషియిన్ల సేవ లు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వారి సేవలు ఉపయోగించు కొనేటట్లు ఆశ వర్కులు, ఆంగన్వాడీ కార్యకర్తలు విసృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి జి. వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారి మంజుల, వైద్యాధికారులు పాల్గొన్నారు.