శామీర్‌పేట, మే 30 : ఫంక్షన్ ఏదైనా సరే పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని బాలాగర్ డీసీపీ సందీప్ అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ బాలానగర్ జోన్ పరిధిలోని ఫాం హౌస్, రిసార్ట్స్, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, యాజమాన్యానికి సోమవారం శామీర్‌పేటలోని ఆరణ్య రిసార్ట్స్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. రిసార్ట్స్, ఫాంహౌస్‌లు, ఫంక్షన్ హాల్స్ నిర్వహణలో విందులు, వినోదాలు ఏ కార్యక్రమం జరిగినా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. శివారు ప్రాంతాల్లో రిసార్ట్స్, ఫాంహౌస్‌లు నిర్మాంచి కిరాయిలకు ఇవ్వడం ద్వారా ఎన్నో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు పట్టుబడిన వాటిల్లో కిరాయి(లీజ్)కు ఇచ్చిన వాటిల్లోనే ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయన్నారు. నేరాలను తగ్గించి శాంతియుత వాతవరణం ఏర్పాటు చేయాలంటే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందేనని అన్నారు. పేట్‌బషీర్‌బాగ్ ఏసీపీ రామలింగరాజు, సీఐలు సుధీర్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, రమణారెడ్డి, డీఐ రాజు, ఎస్ఓటీ సీఐ జేమ్స్‌బాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.