చర్లపల్లి,మే30: సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి డివిజన్లకు చెందిన 17మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను కాప్రా మండలం తహసీల్దార్ అనిత ఎస్తేరు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ రామారావులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో పేదలను పూర్తిగా విస్మరించారని, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా ఆసరా పింఛ న్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పేదల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నారని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, రవికుమార్, సుధాకర్, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, కాప్రా డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, కుమార్‌స్వామి, గిరిబాబు, అనిల్‌కుమార్, మహేందర్‌రెడ్డి, నాయకులు బాల్‌నర్సింహ, రఫీక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ
ఉప్పల్,మే30: వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్‌ను సోమవారం అందజేశారు. ఉప్ప ల్ జీహెచ్ఎంసీ మైదానంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ గీతాప్రవీణ్ ముదిరాజ్ హాజరైనారు. ఈ సందర్భంగా వారికి ఆటపరికరాలను అందించారు. కార్యక్రమంలో నేతలు వెంకటేశ్వర్‌రెడ్డి, రవికుమార్, ప్రవీణ్, వీబీ.నరసింహ, కొండల్‌రెడ్డి,రాం రెడ్డి, జగన్, రామానుజం,రాంచందర్, మహేందర్, సదానందచారి, యాదగిరి, పోచయ్య, రమేశ్ పాల్గొన్నారు.