మల్కాజిగిరి, మే 30: రౌడీ షీటర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నర్సిహస్వామి కథనం ప్రకారం.. రామకృష్ణాపురానికి చెందిన డేవిడ్ ఈనెల 29న తన పుట్టిన రోజు సందర్భంగా డాబాపై మద్యం తాగుతుండగా తన భార్య ప్రియాంక కోడలు అమ్ములు డాబాపైకి వెళ్లగా ఆమెతో గొడవపడిన డేవిడ్ ఆమెను కొట్టాడు.దీంతో కింద ఇంట్లో ఉన్న రౌడీ షీటర్ కల్యాణ్ వచ్చి వారితో గొడవ పడ్డారు. అనంతరం బాలకృష్ణ, కిరణ్‌కుమార్‌తో కలిసి డేవిడ్‌ను హత్య చేయాలని కల్యాణ్ మద్యాన్ని తాగించారు. అనంతరం డేవిడ్‌పై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం గాంధీ దవఖానకు డేవిడ్‌ను తరలించారు.దీంతో పోలీసులు కల్యాణ్,,బాలకృష్ణ,కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.