మల్కాజిగిరి,మే28:బాక్స్డ్రైన్ నిర్మాణం తో వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మచ్చ బొల్లారంలో రూ.7కోట్లతో బాక్స్డ్రైన్ నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వానకాలంలో కాలనీలు ముంపునకు గురవుతున్నాయని, దీన్ని నివారించడానికి బర్టన్‌గూడ మెయిన్ రోడ్డు నుంచి పలు కాలనీల గుండా బాక్స్డ్రైన్ నిర్మిస్తున్నామన్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో కాలనీలు వరదముంపు గురికాకుండా అధికారులతో సర్వే నిర్వహించామన్నారు. వరదముంపు నివారణకు బాక్స్డ్రైన్ నిర్మించాలని ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. ప్రభుత్వం పరిశీలించి రూ.7కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడతామన్నారు.కార్యక్రమంలో డీసీ నాగమణి, డీఈ మహేశ్, ఏఈలు రమేశ్, అనిల్, వాటర్ వర్క్స్ బుచ్చయ్య, డివిజన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీశైలం,అనిల్‌కిశోర్, లోక్‌నాథ్, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ,మధన్గౌడ్, శోభన్, గౌస్బా యి, నర్సింగ్, గణేశ్, నాగేశ్‌గౌడ్, ఆక్రమ్, రవి, రాజుయాదవ్, విగ్నేశ్వరెడ్డి, పరమేశ్,సరిత, దివ, సులోచన,ప్రవణి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో మౌలిక వసతులు కల్పిస్తాం
ఆలయంలో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హన్మంతరావు అన్నారు. శనివారం వెంకటాపురం డివిజన్ భూదేవినగర్‌లోని విజయ గణపతి ఆలయ 19వ వార్షికోత్సవం లో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కిశోర్, డివిజన్ అధ్యక్షుడు భాస్కర్, శివ, లక్ష్మణ్ముది రాజ్, పుదారి రాజేష్కన్న, ప్రభాకర్, మల్లేష్‌గౌడ్, సునీల్‌కుమార్, లక్ష్మరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్సింగ్, రామ్‌రెడ్డి, హేమలత, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటించాలి
నేరేడ్మెట్ , మే 28: సీవరేజీ పనుల్లో పాల్గొనే కార్మికులు భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరుతూ సైనిక్‌పురిలోని జలమండలి ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే హన్మంతరావు, హెచ్ఎండబ్య్లూ డైరెక్టర్ స్వామి పాల్గొన్నారు.కార్యక్రమంలో సైనిక్‌పురి వాటర్వర్క్స జీఎం సునీల్‌కుమార్, మేనేజర్ స్రవంతి, ఈస్టు ఆనంద్‌బాగ్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, నాయకులు ఎస్ఆర్ ప్రసాద్, బజార్ సాయిగౌడ్, సాయినరేశ్పాల్గొన్నారు.