ఘట్కేసర్, మే 27 : ఘట్కేసర్ మున్సిపాలిటీలో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ ప్రధాన రహదారి పై అధికారులు, సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పనులను చైర్పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లీన్ ఘట్కేసర్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త, వ్యర్థాలు, పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామని చెప్పారు. ఘట్కేసర్ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు వచ్చినప్పటి నుంచి పారిశుధ్యంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. సిబ్బంది సహకారంతో పారిశుధ్య పనులు ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రోడ్డు పక్కన ఉన్న కాలువలను శుభ్రం చేసి నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీఆర్ఎస్ నాయకుడు ఎం.జంగయ్య యాదవ్, మున్సిపాలిటీ సూపర్వైజర్లు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.